![]() |
![]() |

ఢీ సెలబ్రిటీ స్పెషల్ నెక్స్ట్ వీక్ ప్రోమో కిక్కెక్కించే డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ వారం షో ప్రాపర్టీ రౌండ్. ఇక చూస్కోండి ఒక్కొక్కళ్ళు దుమ్ము దులిపేసారు. సునంద మాల ఐతే బాబోయ్ అది డాన్స్ ఆ ఇంకేమన్నానా అన్నట్టుగా స్టేజిని షేక్ చేసి పారేసింది. స్టైలిష్ స్టార్ పెర్ఫార్మెన్స్ లా ఉంది అంటూ జడ్జ్ ప్రణీత చెప్పేసింది. "హెవీగా డాన్స్ చేస్తావ్ కానీ మంచి గ్రేస్ తో క్యూట్ గా చేస్తావ్ ..నీ డాన్స్ ప్రొఫెషనల్ డాన్సర్ లా ఉంటుంది" అన్నారు శేఖర్ మాస్టర్. తర్వాత శ్రీప్రియ చేట ప్రాపర్టీతో వచ్చి డాన్స్ ఇరగదీసేసింది.
"శ్రీప్రియ చేట చిరిగిపోయింది" అన్నాడు శేఖర్ మాస్టర్. తర్వాత ఆయనే స్టేజి మీదకు వచ్చి మెడలో పూలదండలేసుకుని అక్కడున్న లేడీస్ తో కలిసి చేసిన మాస్ డాన్స్ కి అందరూ విజిల్స్ వేశారు. "మా సీనియర్ డాన్సర్స్ వాళ్ళు. సుమతి, కోకిల, మంజు, కూకట్పల్లి స్వప్న" అంటూ తనతో డాన్స్ చేసిన వాళ్ళను శేఖర్ మాస్టర్ ఇంట్రడ్యూస్ చేసేసరికి ఆది మధ్యలో వచ్చాడు. "మగాళ్ల పేర్లు ఎప్పుడన్నా గుర్తున్నాయా అండి మీకు" అని అడిగాడు. ఆది డైలాగ్ కి సైలెంట్ గా ఉన్న ప్రణీత కూడా వయలెంట్ డైలాగ్ వేసింది " అందరూ సరదాగా అంటున్నారేమో జోక్స్ వేస్తున్నారు అనుకున్నా కానీ ఇప్పుడు నాకు నిజంగానే డౌట్ వస్తోంది మీమీద " అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఒక సీనియర్ లేడీ డాన్సర్ "మాతో సర్ కి ఉన్న బాండింగ్ వేరే" అని ఆదితో అనేసరికి "నేను కూడా అదే అంటున్నా" అంటూ కౌంటర్ వేసాడు. ఇక ఫైనల్ లో ఆదర్శ్ హౌస్ కీపింగ్ ప్రాపర్టీస్ తో చేసిన డాన్స్ కి ఆ స్టెప్స్ కి శేఖర్ మాస్టర్ ఫిదా ఐపోయి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలాంటి స్టెప్స్ ఇంతకు ముందు చూడలేదంటూ ఆదర్శ్ కి కితాబిచ్చారు. ఈ ప్రోమోని చూసిన నెటిజన్స్ అంతా కూడా ఆదర్శ్ ని తెగ పొగిడేస్తున్నారు.
![]() |
![]() |